ఎక్కువ చేస్తే.. తమిళ హీరోలకే పోటు?


రాబోయే రోజుల్లో సినిమా అనే దానికి లాంగ్వేజ్ బారియర్స్ ఉండకూడదు అని దర్శకధీరుడు రాజమౌళి చెప్పడమే కాదు నిరూపించాడు. ఏదైనా సరే ఇండియన్ సినిమా అనేలా ఉండాలి అనుకున్నారు. అయితే ఇటీవల తెలుగు నిర్మాతలు (దిల్ రాజు వారసుడి విషయంలో) డబ్బింగ్ సినిమాలకు పండగ సీజన్ లో ప్రాధాన్యత ఉండదని అన్నారు.

ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పుడు అదే తరహా రియాక్షన్ వెలువడుతోంది. అక్కడ నిర్మాత మండలి దర్శకుల సంఘాలు వారిసు సినిమాకు అన్యాయం జరిగితే భవిష్యత్తులో తెలుగు సినిమాలకు కూడా అదే తరహా ఇబ్బందులు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక విధంగా మన తెలుగు హీరోలకు తమిళ్ మార్కెట్ కంటే.. తమిళ హీరోలకు తెలుగులోనే మంచి మార్కెట్ ఉంది. 

రజనీకాంత్, కమల్ హాసన్ నుంచి నేటితరం ధనుష్ శివకార్తికేయన్ వరకు అందరికి తెలుగు ఇండస్ట్రీ, జనాల నుంచి సపోర్ట్ బాగానే వచ్చింది. పండగ సీజన్స్ లో కూడా వారి సినిమాలు బాగానే రిలీజ్ అయ్యాయి. వచ్చిన ఇబ్బందల్లా ఇప్పుడు సంక్రాంతికి ఒకేసారి ఎక్కువ థియేటర్లు ఇచ్చేస్తే తెలుగు సినిమాలకు డ్యామేజ్ అవుతుందనేది ఒక వాదన. 

ఇక మన సినిమాలకు తమిళ జనాల నుంచి మాత్రమే కాకుండా అక్కడ ఇండస్ట్రీ నుంచి వచ్చే సపోర్ట్ కూడా తక్కువే. ఈ తరహా గొడవ ముదిరితే తెలుగు హీరోల కంటే తమిళ హీరోలకే పెద్ద డ్యామేజ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మన ఇండస్ట్రీ పెద్దలు కూడా వాళ్ళను టార్గెట్ చేస్తే దాదాపు 20% మార్కెట్ పోయినట్లే.. అయినా ఇండస్ట్రీలో ఏ గొడవ అయినా సరే ఎక్కువ కాలం కొనసాగింది లేదు. కాలక్రమేణా వారి వాగ్దానాలు కోపాలు కూడా ఇట్టే మరిచిపోతారు. జనాలు కూడా కాంట్రవర్సీలను పట్టించుకోని ప్రశ్నించే రకం కాదు కాబట్టి ఏదైనా మంట చల్లారేవరకే..

Post a Comment

Previous Post Next Post