అన్ స్టాపబుల్ షో కోసం మాజీ సీఎం, క్రికెటర్!


నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ పేరుకు తగ్గట్టుగానే కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు సెకండ్ సీజన్లో వచ్చిన గెస్టులు అందరూ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు. ఇక త్వరలో మరి కొంతమంది అగ్ర హీరోలు దర్శకులు కూడా వస్తారని టాక్ అయితే వినిపించింది. కానీ ప్రస్తుతం రావాల్సిన గెస్టులు అందరూ కూడా చాలా బిజీగా ఉండడంతో మరో ఎపిసోడ్ చేయడానికి వీలుపడడం లేదట.

అయితే బాలకృష్ణ సలహా మేరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిలవాలని అనుకుంటున్నాట్టుగా తెలుస్తోంది. అలాగే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పై కూడా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలయ్యకు ఈ ఇద్దరితో మంచి సన్నిహిత్యం ఉంది కాబట్టి ఇద్దరిని తీసుకొస్తే షోకు మరొక రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. అలాగే మరికొంత మంది హీరోయిన్స్ కాంబినేషన్స్ కూడా సెట్ చేయాలని అనుకుంటున్నారు. మరి తదుపరి ఎపిసోడ్ కు ఎవరు వస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post