బాక్సాఫీస్.. యశోద తట్టుకుంది కానీ..

 


టాలెంటెడ్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో ఓపెనింగ్స్ అయితే పర్వాలేదు అనిపించింది. సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు కానీ ఆ స్థాయిలో మాత్రం కలెక్షన్స్ అయితే రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 12 కోట్ల వరకు బిజినెస్ చేసింది.


ఇక మూడు రోజుల్లో ఈ సినిమా  4 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అయితే అందుకుంది. వీకెండ్ లో ఒక విధంగా అయితే మంచి కలెక్షన్స్ అయినప్పటికీ అసలు ప్రమాదం సోమవారం నుంచి ఎదురు కాబోతోంది. ఈరోజు నుంచి బుకింగ్స్ బాగుంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. యశోద సినిమాను దాదాపు 35 కోట్ల భారీ బడ్జెట్ తో తెరపైకి తీసుకువచ్చినట్లు చెప్పారు. కానీ సినిమాలో మాత్రం ఆ రేంజ్ లో అయితే కంటెంట్ కనిపించడం లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. నిర్మాత అయితే నాన్ థియేట్రికల్ గా కొంత సేఫ్ అయ్యాడు అని తెలుస్తోంది. ఇక మరికొంత థియేట్రికల్ గా లాక్కెలైతే సేఫ్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క.

Post a Comment

Previous Post Next Post