డిజాస్టర్ చూసినా.. 28 ఐఫోన్ లు ఇచ్చిన నిర్మాత

SLV సినిమాస్ ఇటీవల కాలంలో మిడియం రేంజ్ హీరోలతో కాస్త హై బడ్జెట్ సినిమాలను నిర్మిస్తోంది. ఒక విధంగా అనవసర కమర్షియల్ ప్రయోగాలు చేస్తోంధనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా అయితే దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ది వారియర్ సినిమా కూడా చాలా వరకు నష్టాలను కలిగించింది. ఇక అంతకుముందు వచ్చిన విరాట పర్వం, ఆడవాళ్ళు మీకు జోహార్లు కూడా ఫెయిల్ అయ్యాయి.


ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ అన్ని ఫ్లాప్స్ చూసినా కూడా ఇప్పుడు ఎంతో నమ్మకంతో దసరా సినిమాపై నాని మార్కెట్ కు మించిన బడ్జెట్ పెడుతున్నారు. ఇక రీసెంట్ చిత్ర యూనిట్ సభ్యులు కష్టాన్ని చూసిన ఆయన కొందరికి ఐఫోన్ 14 ఫోన్లను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా షూట్‌లో ఎక్కువ భాగం దుమ్ము, ధూళిలో జరిగిందట.  28 మంది ప్రత్యేక ప్రమేయానికి బహుమతిగా సరికొత్త ఐఫోన్ 14 మొబైల్‌లను బహుమతిగా అందించారట. సాధారణంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత నిర్మాతలు టీమ్‌కి బహుమతులు ఇస్తారు.  కానీ చాలా అరుదుగా సినిమా షూటింగ్ లోనే బహుమతులు ఇస్తున్నారు ఈ నిర్మాత. మరి నిర్మాత నమ్మినట్లు దసరా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post