ఈ శుక్రవారం విభిన్నమైన సినిమాలు థియేటర్లో విడుదలయ్యాయి. అయితే అందులో సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమాతో పాటు సంగీత ప్రధాన పాత్రలో నటించిన మసూధ సినిమా పైనే ఓవర్గం ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా పడింది. అయితే ఈ శుక్రవారం రెండు సినిమాలకు కూడా డిఫరెంట్ గా టాక్ అయితే వచ్చింది. ముఖ్యంగా గాలోడు సినిమాకు రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమా అయినప్పటికీ ఓపెనింగ్స్ అయితే గట్టిగానే వచ్చినట్లు అర్థమవుతుంది.
మరోవైపు హారర్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన మసూద సినిమా హారర్ సినిమాలు ఇష్టపడే వారికి మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పవచ్చు. కాస్త నిడివి ఎక్కువగా అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి. మరోసారి ఎడిటింగ్ లో అనవసరమైన సన్నివేశాలను లేపిస్తే సినిమా పర్ఫెక్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ శుక్రవారం అయితే ఈ రెండు సినిమాలకు డీసెంట్ కలెక్షన్స్ అందుతున్నాయి. ముఖ్యంగా మసూద సినిమా మొదటి రోజు టాక్ ను బట్టి రెండో రోజు కలెక్షన్స్ కొంత పెరిగే ఛాన్స్ ఉంది. కాస్త హారర్ కాన్సెప్ట్ క్లిక్ అయితే మాత్రం ఇలాంటి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రేంజ్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment