బాలయ్య సినిమా.. 9 కోట్లు అడుగుతున్న హీరోయిన్!

 


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంటనే మరో సినిమా మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసున్న పవర్ఫుల్ వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అతనికి కూతురుగా శ్రీ లీలా కనిపించబోతోంది.


అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరూ అనేది ఇంకా ఫైనల్ కాలేదు. మొన్నటి వరకు అయితే నయన తారను ఫైనల్ చేసి ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వచ్చింది. ఇదివరకే ఆమె బాలయ్యతో సింహా, జై సింహా అనే సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ 108 వ సినిమా కోసం తీసుకోవాలని నిర్మాతలు అనుకుంటున్నారు. కానీ నయన్ ఉహించని స్థాయిలో పారితోషికం అడుగుతుందట. దాదాపు 9 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాతలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చర్చలు కొనసాగుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆమె అడిగినంత ఇచ్చి ఓకే చేస్తారా లేదంటే మరొక నటిని రంగంలోకి దింపుతారా అనేది చూడాలి.

1 Comments

Post a Comment

Previous Post Next Post