హన్సిక.. పెళ్లి కూడా వ్యాపారమే?

 


ఇటీవల కాలంలో సినీ తారలు వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలను కూడా మార్కెటింగ్ గా మార్చుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులను కూడా కమర్షియల్ యాడ్స్ లోకి బాగానే ఉపయోగించుకుంటూ మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. అయితే మరి కొందరు పెళ్లి వేడుకలను కూడా మార్కెటింగ్ చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారుతుంది.


ఆ మధ్యన నయనతార పెళ్లికి సంబంధించి విషయం వైరల్ గా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హన్సిక మోత్వాన్ని కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కథానాయిక హన్సిక మోత్వాని తన వ్యాపార భాగస్వామి సోహైల్ కతురియాతో డిసెంబర్ 4న రాజస్థాన్‌లో వివాహం జరగనుంది. హన్సిక తన వివాహ వీడియోను డిస్నీ+హాట్‌స్టార్‌కి విక్రయించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

చాలా మంది సినీ స్టార్స్ తమ పెళ్లి వీడియోలను ఈ విధంగా విక్రయించడానికి ఇష్టపడనప్పటికీ, కొంతమంది స్టార్ హీరోయిన్లు వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించాలని చూసుకుంటున్నారు. సాధారణంగా ఈ వీడియోలను ఫ్యాన్స్ కోసమే క్రియేట్ చేస్తున్నట్లు కొంతమంది సెలబ్రిటీలు కామెంట్ చేస్తున్నారు. అయితే ఓటిటిలో ఆ విధంగా వ్యాపారపరంగా కాకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు కదా అనే విధంగా కూడా మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post