హిట్ 2 బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?


అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే నైజాంలో 4 కోట్లు, ఆంధ్రలో 4.50 కోట్లు, సీడెడ్ 3.50 కోట్ల వరకు బిజినెస్ చేసింది.


ఇక నైజాం ఏపీలో కలుపుకొని 10 కోట్ల ధర పలికిన ఈ సినిమా కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో 50 లక్షల బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో 3 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 16 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 17 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంటుంది. మరి హిట్ 2 సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post