కమల్ హాసన్ - విజయ్ కాంబో!



విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి నటించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో పాత్రలతోనే కథకు మరింత బలం తీసుకువచ్చిన దర్శకుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా తీసుకొస్తాను అని ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మరొక దర్శకుడు ఆలోచన ప్రకారం కమల్ హాసన్ విజయ్ సేతుపతి కలిసి నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.


దాదాపు హీరోల రేంజ్ లోనే విజయ్ మంచి పారితోషికాలు అందుకుంటున్నాడు. ఇక వాలిమై దర్శకుడు H వినోథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రాజెక్టులో విజయ్ సేతుపతి కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడనుంది. మరి ఈ కాంబినేషన్ రెండోసారి కూడా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post