సుడిగాలి సుధీర్ మాస్ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్!

టెలివిజన్ ప్రపంచంలో మంచి గుర్తింపును అందుకున్న సుడిగాలి సుదీర్ గత కొంతకాలంగా వెండితెరపై కూడా హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. అయితే ఆ రూట్లో మాత్రం అతనికి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇక ఇప్పుడు అతని నుంచి గాలోడు అనే ఒక ఒక్క మాస్ కమర్షియల్ సినిమా నవంబర్ 18న రాబోతుంది.


ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఉండాల్సినవన్ని కూడా గట్టిగానే యాడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను నైజం ఏరియాలో 130 ధియేటర్లకు పైగా విడుదల చేస్తుండగా ఆంధ్రాలో మొత్తంలో చూసుకుంటే 185 థియేటర్లకు పైగా విడుదల చేయబోతున్నారు. మొత్తం ఏపీ తెలంగాణలో చూసుకుంటే దాదాపు 370 కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కానీ సినిమా బిజినెస్ 2.5 కోట్ల రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post