రష్మిక మందన్న.. చుక్కలు చూపించేలా చర్యలు?

 

రష్మిక మందన్న ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు కన్నడ చిత్ర పరిశ్రమలు అలజడిని క్రియేట్ చేస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె కాంతార సినిమా చూడలేదు అని సమయం దొరకడం లేదు అని చెప్పింది. అంతేకాకుండా మొదటి ప్రొడక్షన్ వాళ్ళు ఒక మ్యాగజైన్లో తన ఫోటో చూసి ఛాన్స్ ఇచ్చినట్లుగా చెప్పింది. అయితే ఆమె నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా సోకాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అని చెప్పడంతో పాటు కాంతార సినిమా గురించి చాలా తేలిగ్గా మాట్లాడడం పై కన్నడ జనాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.


అయితే ఇప్పుడు కర్ణాటక సినిమా ఇండస్ట్రీ లోని వివిధ రకాల ఆర్గనైజేషన్ కమిటీలు ఆమె సినిమాలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇదివరకే రిషబ్ శెట్టి ఒక కౌంటర్ కూడా ఇచ్చాడు. డైరెక్టర్ గా మొదటి సినిమా ఛాన్స్ గా కిరిక్ పార్టీలో అతనే ఇచ్చాడు. ఇక అందులో హీరోగా ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి నటించాడు. ఇక సో కాల్డ్ ప్రొడక్షన్ అని వెటకారం చేసి మాట్లాడిన విధానంపై రీషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో రష్మిక పేరు ఎత్త కుండానే ఆమె హావభావాలు చూపిస్తూ అలాంటి వారితో నటించడం ఇష్టం ఉండదని అన్నాడు. ఇక ఇప్పుడు ఆమెపై కన్నడలో నిషేధం విదిస్తే రాబోయే వారసుడు సినిమాతో పాటు పుష్ప 2 సినిమాలకు పెద్ద డ్యామేజ్ జరిగినట్లే..

Post a Comment

Previous Post Next Post