అల్లు అరవింద్ తోడేలు.. దిల్ రాజు లవ్.. బిజినెస్ ఎంతంటే?

 


నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల కాంతార సినిమాతో అతి తక్కువ పెట్టుబడి తో తెలుగులో విడుదల చేసి భారీ స్థాయిలో లాభాలను అందుకున్నాడు. ఆ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన హిందీలో విడుదలవుతున్న భేడియా సినిమాను తెలుగులో తోడేలుగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగులో 260కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.


మొత్తంగా తోడేలు రెండు కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక లవ్ టుడే సినిమాతో దిల్ రాజు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తమిళంలో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 285 థియేటర్లకు పైగా విడుదల చేయబోతున్నారు. ఇక మొత్తంగా ఈ సినిమా 2.70 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఈ అగ్ర నిర్మాతలు దాదాపు 90% సక్సెస్ అయిన వారే. మరి ఇప్పుడు ఈ రెండు సినిమాలు వారికి ఎలాంటి లాభాలను అందిస్తాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post