మరో తెలుగు సినిమాలో సంజయ్ దత్?

 


బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కేజిఎఫ్ 2లో ఆయన పవర్ ఫుల్ విలన్ గా కనిపించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు మారుతి ప్రభాస్ సినిమాల్లో కూడా ఆయన ఒక విభిన్నమైన పాత్రలో కనిపించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.


అయితే మరి కొంతమంది దర్శక నిర్మాతలు ఆయనను తెలుగులో తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక తెలుగు సినిమా కోసమే ప్రముఖ దర్శకుడు నిర్మాత ఇటీవల సంజయ్ దత్ దగ్గరకు వెళ్లి కథ గురించి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా సంజయ్ దత్ ఆ ప్రాజెక్టు గురించి ఇలాంటి నిర్ణయాన్ని చెప్పలేనట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో అయితే అది మహేష్ బాబు 28వ సినిమా కోసమే అని త్రివిక్రమ్ ఒక సీనియర్ నటుడి కోసం సంప్రదిస్తున్నాడు అని అది సంజయ్ దత్ అని కూడా వార్తలు ప్రచారం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post