కృష్ణ గారికి వీడ్కోలు.. మరోసారి మహేష్ ఎమోషనల్

 


టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని అంత్యక్రియలు పూర్తయ్యాయి. పద్మలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు కొనసాగిన అంతిమయాత్రలో చాలామంది సినీ ప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు నిర్వహించారు.


ఇక మరోసారి మహేష్ బాబు ఊహించని పరిస్థితుల్లో కనిపించాడు. తన తండ్రికి కడసారి వీడ్కోలు పలుకుతూ చితికి నిప్పంటించాడు. అంతిమ సంస్కరణలలో ఇటీవల తన తల్లి కోసం పాల్గొన్న మహేష్ బాబు మళ్ళీ ఆ బాధ నుంచి కోలుకోక ముందే మళ్ళీ తండ్రి అంతిమ సంస్కరణలో పాల్గొనడం అందరిని ఎంతగానో కంటతడి పెట్టించింది. ఇక మహేష్ బాబు తన తండ్రికి వీడుకోలు పలుకుతూ ఒక్కసారిగా కంటి తడి పెట్టుకున్నాడు. ఇక కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు అభిమానులు కోరుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post