వరంగల్ శ్రీను.. ఏడాదిలోనే వంద కోట్లు పాయే!

నైజం ఏరియాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు పోటీగా ఆ మధ్య వరంగల్ శ్రీను చేసిన హడావిడి అంతా కాదు.  ఎదగనివ్వకుండా చేస్తున్నారు అని అతను చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో క్రాక్ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న వరంగల్ శ్రీను ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ లో దారుణంగా నష్టపోయాడు ముఖ్యంగా ఈ ఏడాదిలోనే అతను కొన్ని సినిమాలతో 100 కోట్లకు పైగా నష్టాలను చూడాల్సి వచ్చింది.


విక్రాంత్ రోణా అనే డబ్బింగ్ సినిమా తప్పితే డిస్ట్రిబ్యూషన్ లో అతనికి ఏ సినిమా కూడా పెట్టిన పెట్టుబడికి కొంత లాభాన్ని కూడా ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా లైగర్ సౌత్ ఇండియా లో 50 కోట్ల వరకు పోగొట్టింది. ఇక ఆచార్య నైజం హక్కులను సొంతం చేసుకోగా అది 25 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. ఇక విశాల్ సామాన్యుడు నాలుగు కోట్లు, విరాటపర్వం 8.5 కోట్ల నష్టాలను కలుగజేశాయి. రామారావు ఆన్ డ్యూటీతో 10 కోట్లు లాస్ అవ్వగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా 8 కోట్ల వరకు నష్టలను మిగిల్చింది.

Post a Comment

Previous Post Next Post