ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం - రివ్యూ & రేటింగ్


కథ:
అల్లరి నరేష్ (శ్రీనివాస శ్రీపాద) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పంచుఇస్తుండగా.. అల్లరి నరేష్ ఎన్నికల విధుల కోసం గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లికి పంపబడతారు.  ఆ ప్రక్రియలో (అప్పనా) అనే వ్యక్తి తన ఓటు వేయడానికి ఇష్టపడడు. అలాగే అతను రాజకీయ వ్యక్తుల వలన హత్య చేయబడతాడు.  శ్రీనివాస్ అప్పనకు న్యాయం జరిగేలా చేయాలని అనుకుంటాడు. ఇక ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో శ్రీనివాస్ గిరిజన సమస్యలను ఎలా పరిష్కరించాడు.  అప్పన్నకు న్యాయం చేశాడా? అనేది సినిమా అసలు కథ.


విశ్లేషణ:
అల్లరి నరేష్ ఈ సినిమాలో మరోసారి తన నటనతో ఎట్రాక్ట్ చేశాడు. సిన్సియర్ తెలుగు టీచర్‌గా అతను బాగా నటించాడు.  హీరోయిన్ ఆనంది అందంగా కనిపించడంతో పాటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక వెన్నెల కిషోర్ మరోసారి తన నటనతో సినిమాను కాపాడాడు. అతని డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఫన్నీ చేష్టలు మరోసారి క్లిక్కయ్యాయి. సినిమా క్లైమాక్స్‌ వరకు కథను అనుకున్నట్లు తీసుకు రావడం బాగానే ఉంది.  సినిమాలో విజువల్స్‌ అలాగే ఎంచుకున్న లొకేషన్‌లు అద్భుతంగా ఉన్నాయి.

ఇక సెకండాఫ్‌లో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. బ్రేక్ టైమ్‌లో తీసుకొచ్చిన చిన్న ట్విస్ట్‌ దాన్ని ఎలా ముందుకు తీసుకువెళతారు అనేది ఆసక్తిని కలిగించింది. అటవీ ప్రాంతాల్లో నివసించే గ్రామస్తుల కష్టాలను దర్శకుడు మోహన్ చక్కగా చూపించారు. ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం సినిమా అసలు కథ అయితే చాలా పాతది.  ఇలాంటి సమస్యలపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా కూడా అందుకు భిన్నంగా లేదు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ నోట్ తో మొదలై ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్త గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది.

కానీ సెకండ్ హాఫ్ తరువాత మరీంత రొటీన్ గానే కథ ముందుకు సాగుతుంది.  కథనం మంచిదే.. కానీ స్క్రీన్ ప్లే విషయంలో బోరింగ్ గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరీ సిల్లీగా అనిపిస్తాయి. ముఖ్యంగా పోలీస్ బలగాలకు సంబంధించిన ఒక సీన్ అయితే సినిమా స్థాయిని తగ్గించే విధంగా ఉంది. ఒక సమస్యను ఆడియెన్స్ లో బలంగా వెళ్ళేలా చేసి దానికి సొల్యూషన్ ను కూడా మరింత ఆలోచింప చేసే విధంగా తెరపైకి తీసుకు రావాలి. కానీ దర్శకుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్ గా ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం సినిమాలో నిజాయితీతో కూడిన ఒక పాయింట్ చెప్పాలని చూశారు. కొంతవరకు కాన్సెప్ట్ బ్యాక్‌డ్రాప్, కొందరు నటించిన విధానం సన్నివేశాలు డీసెంట్‌గా ఉన్నాయి. కానీ అసలైన కొన్ని సన్నివేశాలతో మాత్రం సినిమా ఆసక్తిని రెపదు. పెద్దగా అంచనాలు లేకుండా సీరియస్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్:
అల్లరి నరేష్ నటన
వెన్నెల కిషోర్ కామెడీ

మైనస్ పాయింట్స్:
రోటీన్ కథనం
క్లయిమ్యాక్స్
సెకంస్ హాఫ్ లో సీన్స్

రేటింగ్: 2.50/5

Post a Comment

Previous Post Next Post