నాని ప్రొడక్షన్లో వచ్చిన హిట్ 2 సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకువచ్చేసింది. నిర్మాత నానితోపాటు మరి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా దాదాపు ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసారు. కానీ ఒక ఏరియాలో మాత్రం ఇంకా ఈ సినిమా బిజినెస్ కు తగ్గట్టుగా అయితే లాభాల్లోకి రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికే 13 కోట్లకు షేర్ కలెక్షన్స్ అందుకుంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే 20 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఇక హిట్ 2 మొత్తంగా 15 కోట్ల బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. అంటే ప్రస్తుతం మొత్తంగా చూసుకుంటే ఐదు కోట్ల పైగా ప్రాఫిట్ తోనే ఈ సినిమా కొనసాగుతోంది. దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ప్రాఫిట్స్ రాగా ఒక సీడెడ్ ఏరియాలో మాత్రం ఇంకా ఈ సినిమా లాభాల్లోకి రాలేదు. అక్కడ ఈ సినిమాను 1.75 కోట్లకు బిజినెస్ చేసింది. అయితే ఇప్పటివరకు 1.40 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు వారాంతరం కూడా ముగిసింది. మరి ఈవారం లో అయినా అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేస్తుందో లేదో చూడాలి.
Follow
Post a Comment