100 కోట్లు పోగొట్టుకున్న సీనియర్ నటుడు

 ఇప్పుడున్న స్టార్ హీరోలలు వారి సంపాదనను వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఒకప్పటి స్టార్ యాక్టర్స్ మంత్రం ఓకే ఒక రూట్ ని ఎక్కువగా ఫాలో అయ్యారు. ముఖ్యంగా శోభన్ బాబు లాంటి వారు ల్యాండ్స్ బిజినెస్ లో వేల కోట్లు సంపాదించుకున్నారు. ఆయన ఆస్తుల గురించి మాట్లాడుకుంటే టైమ్ సరిపోదు. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఆయనే రిచేస్ట్ హీరో అని చెప్పవచ్చు. ఆయన వందల కోట్ల ఆస్తి ఇప్పుడు వేల కోట్లకు చేరింది. అయితే చంద్రమోహన్ కూడా శోభన్ బాబు బాటలోనే ఆస్తులు కూడబెట్టుకున్నప్పటికి చివరకు 100 కోట్లు కోల్పోవాల్సి వచ్చిందట.


సినిమా ఇండస్ట్రీలో చాలావరకు ఒకప్పటి సినీ స్టార్స్ వారి ఆదాయాన్ని సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేసేవారు. కానీ శోభన్ బాబు మాత్రం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతూ వచ్చారు. జనాభా పెరిగిన కొద్దీ భూమి రేటు పెరుగుతుంది అనే ఫార్ములాను ఆయనే ఎక్కువగా ఫాలో అయ్యారు. ఇక ఆయన సలహాలతోనే మురళీమోహన్ కూడా వేల కోట్లు సంపాదించుకున్నారు. ఇక శోభన్ బాబుకు మంచి మిత్రుడైన ఒకప్పటి స్టార్ యాక్టర్ చంద్రమోహన్ కూడా చెన్నై లో బాగానే సంపాదించుకున్నారు.

అయితే ఆయన ల్యాండ్స్ ను గ్యాప్ లేకుండా కొనుగోలు చేసిన అనంతరం ఎక్కువ కాలం వాటిని మ్యానేజ్ చేయలేకపోయారు. ఇద్దరు కుతుళ్ళే కావడం వారు కూడా విదేశాల్లో స్థిరపడడంతో ఆస్తులను చూసుకోవడం కూడా కష్టమైందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హైదరాబాద్ సిటీలో కూడా కొనుగోలు చేసిన 20 ఎకరాల ల్యాండ్ ను అప్పట్లో తక్కువ ధరకు అమ్ముకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా శంషాబాద్ లో రోడ్డు పక్కనే ఉన్న 15 ఎకరాలను కూడా కొన్ని లిటికేషన్స్ వలన అప్పట్లో లక్షల్లోనే అమ్మాల్సి వచ్చిందని ఆ ఆస్తుల విలువ ఇప్పటి ఖరిదు 100 కోట్లకు పైగానే ఉంటుందని అన్నారు. పూర్తి స్థాయిలో చూసుకునే టైమ్ లేకనే వాటిని అమ్మేసినట్లు చెప్పిన చంద్రమోహన్ ఇప్పుడు తనకు వేల కోట్లు లేవని.. కానీ బాగానే స్థిరపడినట్లు చెప్పారు.

Post a Comment

Previous Post Next Post