హీరో నాగార్జునకు రైతుబంధు డబ్బులు?


సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఎంతోమంది రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించే ఒక మంచి పథకం అని చెప్పవచ్చు. నిజానికి ఈ పథకం కొంత వరకు విజయవంతమైంది. ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం కూడా అదే తరహాలో దానిని కాపీ చేసింది. అయితే రైతు బంధు పథకంలో అనేక రకాల లొసుగులు కూడా ఉన్నాయనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.


లేని వాడికి ఇలాంటి పథకం అందితే ఉపయోగమే కానీ
ఒక 600 ఎకరాలు ఉన్న వారికి ఎకరానికి 5000 చొప్పున బ్యాంక్ లో పడితే ఏంటి లాభం.. అలాంటి వారికి ఉచితంగా డబ్బులు ఏ రేంజ్ లో వస్తాయో ఊహించుకోవచ్చు. ఈ పథకం కౌలు రైతుల సమస్యలకు ఏ మాత్రం ఉపాయోగం లేదు. అయితే అంత ఉన్న వాళ్ళకు కూడా రైతుబంధు ఇచ్చే బదులు అదే డబ్బు మరింతగా లేని వారికి వివిధ రకాలుగా సహాయం చేస్తే బాగుంటుందని కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఈ రైతుబంధు పథకాలు అందుకుంటున్న వారిలో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేనికి కూడా రైతుబంధు వస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఇటీవల వెల్లడించారు.  హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో 30 ఏళ్లుగా పనిచేసిన ఓ వ్యక్తికి తెలంగాణలో వ్యవసాయ భూములు ఉన్నాయి. వారికి కూడా రైతు బంధు డబ్బు ఎకౌంట్ లో జమ అవుతుంది.  హీరో నాగార్జున కూడా రైతు బంధు ప్రయోజనాలను పొందుతున్నాడు. ఇంత సంపన్నులకు ఇది అవసరమా? దాని బాదులుగా రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల్లో 22 లక్షల మందికి పైగా ఉన్న కౌలు రైతులను అందుకుంటే బావుంటుంది కదా.. అని మురళి అన్నారు.

Post a Comment

Previous Post Next Post