త్రివిక్రమ్.. మహేష్ ను ఎలా తట్టుకుంటున్నాడో?


మహేష్ బాబు ఒకప్పటి తరహాలో ఇప్పుడు మాత్రం అస్సలు ఆలోచించడం లేదు. ఎంత పెద్ద స్టార్ దర్శకుడైన సరే కథ పూర్తిస్థాయిలో నమ్మకం గా అనిపిస్తే గాని షూటింగ్ మొదలు పెట్టడం లేదు. ఒకవేళ మధ్యలో అనుమానాలు వచ్చినా కూడా క్యాన్సిల్ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. SSMB 28వ సినిమాను  త్రివిక్రమ్ తో మొదలుపెట్టగా మొదటి ఎపిసోడ్ అంతగా నచ్చకపోవడంతో వెంటనే కథనే చేంజ్ చేయమని చెప్పేసాడు. దీంతో త్రివిక్రమ్ మరో కథను సెట్ చేసుకోవాల్సి వచ్చింది.


సాధారణంగా మహేష్ ఒక్కసారి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మధ్యలో వేలుపెట్టడు అని ఇంతకుముందు చాలామంది చెప్పారు. కానీ ఇప్పుడు మహేష్ కూడా మిగతా హీరోల తరహా లోనే ప్రతి సీన్ విషయంలో కూడా దర్శకులతో ఒకటికి పది సార్లు చర్చిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ అయితే అల.. వైకుంఠపురములో.. లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత కూడా మరో సినిమాను ఇంతవరకు తీసుకురాలేదు. మహేష్ చెప్పిన ప్రతి విషయాన్ని అతను పరిగణలోకి తీసుకొని ఎంతో ఓపికతో ముందుకు వెళుతున్నాడు.

అసలైతే ఏడాది క్రితమే వీరి ప్రాజెక్టు మొదలవ్వాలి కానీ మహేష్ పెడుతున్న షరతులకు ప్రాజెక్ట్ ఎన్నోసార్లు మారింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మరోసారి ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మళ్లీ జనవరి మొదటి వారం తర్వాత గాని రాడు. ఇక ఆ తర్వాతనే త్రివిక్రమ్ కొత్త కథ మొదటి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇక మహేష్ బాబు ఈ రేంజ్ లో కండిషన్స్ పెడుతూ వాయిదాలు వేస్తున్న కూడా త్రివిక్రమ్ ఎంతో ఓపికతో ఉన్నాడు. ఒక విధంగా త్రివిక్రమ్ కు ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా అందుబాటులో లేడు. అందుకే.. మహేష్ ఎంత రిజెక్ట్ చేస్తున్న కూడా అతని వెంటే పరిగెడుతున్నాడు.

అయితే గతంలో మాత్రం మహేష్ బాబు ఇదే తరహాలో డిఫరెంట్ కండిషన్స్ చెప్పడంతో సుకుమార్ అయితే అతన్ని వదిలేసి రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు. పూరి కూడా లాభం లేదనుకొని మహేష్ బాబు వెంట ఎక్కువ రోజులు తిరగలేక పోయాడు. అదేవిధంగా అర్జున్ రెడ్డి దర్శకుడు కూడా కొన్ని కథలను సెట్ చేసుకున్నా కూడా మహేష్ బాబు సంతృప్తి చెందలేదు. దీంతో అతను బాలీవుడ్లోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మహేష్ అయితే ఒక సినిమా విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలకు కొంతమంది దర్శకులు ఓపిక పట్టలేక మిగతా హీరోల వైపు మొగ్గు చెబుతున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం అసలు విడిచిపెట్టడం లేదు. అతను కూడా వంశీ పైడిపల్లి తరహాలోనే మొండి పట్టుదలతో మహేష్ బాబుతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. మరి వీరి కాంబినేషన్లో వచ్చే కథ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

1 Comments

  1. Hero ke katha nacha ka pothe Inka audience ke em nacha cheputara
    ee vishyamlo any hero ina inthe.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post