రౌడి బాయ్ సినిమాలో ఉప్పెన పాప?


సమంత, విజయ్ దేవరకొండ జంటగా 'ఖుషి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  సమంత అస్వస్థతకు గురికావడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించేందుకు యంగ్ హీరోయిన్ కృతిశెట్టిని మేకర్స్ సంప్రదించినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 


కృతి ఈ చిత్రం యొక్క ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తుందట. కృతి శెట్టి గత కొన్ని నెలలుగా కొన్ని  తొందరపడి సినిమాలకు సైన్ చేయడం లేదు. ఇక ఆమె విజయ్ దేవరకొండతో సినిమా చేయడం చాలా ఆసక్తిని కలోగిస్తోంది. ఈ సినిమాను యువ దర్శకుడు శివ నిర్వణ తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక సౌత్ ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలలో ఖుషి సినిమాను విడుదల చేయనున్నారు. 

Post a Comment

Previous Post Next Post