పాపం రవితేజ.. కోట్ల రూపాయలు జస్ట్ మిస్!


మాస్ మహారాజ్ రవితేజ ధమాకా సినిమాతో మొత్తానికి 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోబోతున్నట్లుగా ప్రచారాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఏదేమైనా కూడా ధమాకా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి కి డబుల్ ప్రాఫిట్స్ అందిస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. 

అయితే రవితేజ ఈ సినిమా మొదలయ్యే ముందు తీసుకున్న ఒక నిర్ణయం అతనికి ఇప్పుడు కోట్ల రూపాయలను మిస్సయ్యేలా చేసింది. క్రాక్ సినిమా సమయంలో బడ్జెట్ ఎక్కువైంది అని రవితేజ రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. దీంతో సినిమా దాదాపు 15 కోట్లకు పైగానే లాభం తీసుకువచ్చింది. 

అయితే ఖిలాడి సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకొని సైడ్ అయినా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు మాత్రం ఏకంగా తను కూడా పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ సినిమా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. ఇక ధమాకా సినిమా విషయంలో మాత్రం రవితేజ రిస్క్ చేయలేకపోయాడు. కేవలం రెమ్యూనరేషన్ తీసుకుని సైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఆ సినిమాకు భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ రవితేజ షేర్ డీల్ సెట్ చేసుకొని ఉంటే దాదాపు 8 కోట్ల పారితోషికంతో పాటు మరింత ఎక్కువగా మరో 6 నుంచి 8 కోట్లకు పైగానే షేర్ వచ్చేది.

Post a Comment

Previous Post Next Post