సీతారామం హీరోయిన్ రెమ్యునరేషన్ పెంచిందా?


సీతారామం సినిమాలో తన అందంతో నటనతో ఎంతగానో ఆకట్టుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ మృనల్ థకుర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ బ్యూటీ ఇంతకుముందు టెలివిజన్ వెబ్ సీరీస్ లతో నటిస్తూ వచ్చింది. ఇక సీతారామం ఒక్కసారిగా ఆమె దశను మార్చెసింది. 

ఇప్పుడు మృనల్ కు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నాని 30వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో ఆమె చేయబోయే పాత్ర కోసం రెమ్యునరేషన్ గట్టిగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సీతారామం సినిమాకు 60 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు నాని సినిమా కోసం ఏకంగా 1.50 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. ఇక అందులో హిట్టయినా ఆ లెక్క మరో లెవెల్ కు వెళుతుంది అని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post