కథ:
వీరసింహారెడ్డి (బాలకృష్ణ) రాయలసీమలోని పులిచెర్లకు చెందిన నాయకుడు. అతని కొడుకు జై సింహారెడ్డి (బాలకృష్ణ) ఇస్తాంబుల్ నగరంలో ఉంటాడు. మరోవైపు భానుమతి (వరలక్ష్మి) పులిచెర్లలో వీర ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తుంది. అయితే వీరసింహా రెడ్డికి ఆమెకు వ్యతిరేకంగా ఎందుకు వచ్చింది? జై / వీరసింహారెడ్డి ప్రత్యర్థి వర్గం ముఠాలను ఎలా ఎదుర్కొంటారు? అసలు సమస్య ఏమిటి అనేదే ఈ సినిమాలోని అసలు కథ.
విశ్లేషణ:
క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉండి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్క్రిప్ట్ నుంచి డైలాగ్స్ వరకు అలాగే యాక్షన్ ప్రతీ ఒక్క దానిపై కూడా ఆడియెన్స్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ రేంజ్ లో ఈ కాంబినేషన్ ఆకట్టుకుందా లేదా అంటే.. దర్శకుడు స్క్రిప్ట్ మొదట్లో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. చిన్నప్పటి బాలకృష్ణ, శృతి హాసన్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి. ఇక కథలోకి వీరసింహారెడ్డి ప్రవేశించిన తర్వాత, సినిమా హై-ఆక్టేన్ యాక్షన్ మోడ్‌కి మారుతుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటైన రాజకీయ డైలాగులను దర్శకుడు చాలా తెలివిగా ఇరికించాడు.
బాలయ్య వీరసింహ గెటప్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అలాగే సన్నివేశాల స్కేల్ మొదలైన అంశాలు ఫస్ట్ హాఫ్‌ని హడావుడిగా నడిపించాయి. ఇక ఫస్ట్ హాఫ్ అంచనాలు పెంచింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక్కసారిగా డౌన్ అయినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ కోసం, దర్శకుడు రొటీన్ ఫార్మాట్ లోనే సేఫ్ స్క్రీన్ ప్లే ఫార్ములా వాడాడు. కానీ ట్రీట్మెంట్ కూడా స్లోగా ఉంది. భానుమతిగా వరలక్ష్మి బాగా నటించినప్పటికీ సిస్టర్ సెంటిమెంట్ సినిమాకు పెద్దగా పని చేయలేదు.
ఇక బాలకృష్ణ రెండు పాత్రల్లోనూ బాగానే ఉన్నా వీరసింహా పాత్రలోనే ఎక్కువగా మెప్పించాడు. అతని రెగ్యులర్ మాస్ మసాలా మూవీకి తగ్గట్టుగా అక్కడక్కడా ఫ్యాన్ మూమెంట్స్ పేలాయి. ఇక ఎమోషనల్ సీన్స్ చేసిన బహుళ సన్నివేశాలు కూడా ఉన్నాయి. శృతి హాసన్, హనీ రోజ్ పాత్రలకు స్క్రీన్ స్పేస్ తక్కువ. వరలక్ష్మి శరత్ కుమార్‌కి మాత్రం కథలో మంచి పాత్ర లబించింది. ఆమె అద్భుతంగా నటించింది. ఇక మెయిన్ విలన్‌గా దునియా విజయ్ హుషారుగా, ఆవేశంగా కనిపిస్తున్నాడు. కానీ అతని సీన్స్ ఇంకా బలంగా ఉండి ఉంటే బాగుండేది. మురళీ శర్మ పాత్ర కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఈ సినిమాకు థమన్ ఇచ్చిన మాస్ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయ్యాయి. ఇక సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాలో ప్రత్యేకంగా నిలిచాయి. చక్కటి మాస్ డైలాగ్స్ రాసాడు. కొన్ని పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ కూడా గట్టిగానే పేలాయి. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. ఇక ఫైనల్ గా ఈ సినిమా బి, సి సెంటర్లలో మాస్ ఆడియెన్స్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్:
👉బాలయ్య పెర్ఫార్మెన్స్
👉ఫస్ట్ హాఫ్ ఎపిసోడ్స్
👉పొలిటికల్ డైలాగ్స్
👉పలు యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
👉 కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్
👉 ఎమోషనల్ సీన్స్
👉 బలం లేని కథ
రేటింగ్: 2.75/5
Follow
Follow
Post a Comment