బింబిసార డైరెక్టర్.. బడా హీరో ఫిక్స్?


తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న  “బింబిసార” దర్శకుడు మల్లిడి వేణు అకా వశిష్ట. ఆ చిత్రం 2022లో అద్భుతమైన కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక, కళ్యాణ్ రామ్‌తో బింబిసార సినిమా కంటే ముందు రామ్, అల్లు శిరీష్ వంటి హీరోలతో చేయాలనుకున్నాడు. కానీ ఆ కాంబినేషన్స్ సెట్టవ్వలేదు.

ఇక ఇటీవల వేణు చెప్పిన కథతో నందమూరి బాలకృష్ణ బాగా ఇంప్రెస్ అయ్యారని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.  బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK108 షూట్‌లో పాల్గొంటాడు.  ఆ సినిమా తర్వాత బాలయ్య, బింబిసార దర్శకుడి తో కలిసి వర్క్ చేయవచ్చని సమాచారం.

Post a Comment

Previous Post Next Post