బాహుబలి రేంజ్ లో విజయ్ బిగ్ ప్లాన్!


టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీగా వచ్చిన బాహుబలి సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని అమాంతం పెంచేసింది. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కాంతారా, సాహో లాంటి సినిమాలతో తెలుగు సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశంలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K మూవీ టాలీవుడ్ నుంచి తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తెలుగు సినిమాలతో ఎప్పుడూ కూడా పోటీ పడే కోలీవుడ్ సినిమాలు ఇప్పుడు బడ్జెట్ పరంగా కూడా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

అందులో భాగంగా పాన్ ఇండియా కథలని అక్కడి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో హీరోలు కూడా పాన్ ఇండియా ఇమేజ్ కోసం పీరియాడిక్ జోనర్ కథలని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు. ధనుష్ ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నారు. అలాగే పొన్నియన్ సెల్వన్ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఒక్క తమిళంలో తప్ప అన్ని బాషలలో ఈ సినిమా ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. 

అయితే ఇప్పుడు తెలుగు హీరోలతో సమానమైన మార్కెట్ ని అందుకోవడానికి ఇళయదళపతి విజయ్ ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలితో పోటీ పడుతూ అప్పట్లో భారీ బడ్జెట్ తో పులి అనే సినిమా చేశారు. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు మరోసారి బాహుబలి రేంజ్ బడ్జెట్ తో పాటు, హిస్టోరికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా చేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. 

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా లెవల్ లో పీరియాడిక్ కథ చేయడం కోసం చాలా మంది దర్శకుల కథలు వింటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ని రంగంలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తో పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో ఈ మూవీని చేయడం కోసం విజయ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అలాంటి కథని చెప్పి విజయ్ ని ఒప్పించే ఛాన్స్ ఏ దర్శకుడికి వస్తుందనే వేచి చూడాలి.

Post a Comment

Previous Post Next Post