ఎన్టీఆర్ 30 గురించి భారీ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కొత్త సంవత్సరం రోజు మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చారు. 2024 ఏప్రిల్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఆ డేట్ ప్రకటించడానికి బలమైన కారణం కూడా ఉంది.
తెలుగు పండుగ ఉగాది మంగళవారం (ఏప్రిల్ 9) వస్తుంది. ఉగాది తర్వాత రెండు రోజులు రంజాన్ (ఏప్రిల్ 11). అనంతరం వీకెండ్స్ తో పాటు శ్రీరామనవమి (ఏప్రిల్ 17). అంటే ఈ చిత్రం దాదాపు 2 వారాల పాటు బాక్సాఫీస్‌ను శాసిస్తుంది. కాబట్టి మేకర్స్ ఈ తేదీని లాక్ చేసారు. ఇది సరైనది. ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఎన్టీఆర్ 30 ఈజీగా బాక్సాఫీస్ వద్ద ఊహించని లాభాలు తీసుకొస్తుంది. ఎన్టీఆర్ 30 టీమ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించారు.
Follow
Post a Comment