ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా నష్టాలు.. కొంపముంచిన టెలిగ్రామ్!

అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ రాబోతోంది అనగానే ఆహా సబ్ స్క్రిప్షన్ కోసం జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆహా అంటే తెలియని వారికి కూడా ఎకౌంట్ ను సబ్ స్క్రిప్షన్ కోసం బాగానే పోటీ పడ్డారు. అయితే ఆహా మాత్రం గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ప్రభాస్ ఎపిసోడ్ తో వస్తుందని అనుకున్న భారీ ఆదాయం చాలా వరకు మిస్సయ్యింది. మధ్యలో తెలిగ్రామ్ వలన బాగా దెబ్బ పడింది.


ప్రభాస్ లాంటి స్టార్ ను తీసుకు వస్తున్నారు అంటే అంచనా వేసుకొని రెడీగా ఉండాలి. కానీ ఆహా మాత్రం సర్వర్స్ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంతో ఒక్కసారిగా ఆహా క్రాష్ అయ్యింది. 9 గంటలకు స్ట్రీమింగ్ కావాల్సిన ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 12 అయినా చాలామందికి కనబడలేదు. ఇక హ్యాకర్లు టెలిగ్రామ్ మాఫియా అందరూ కూడా అప్పటికే మొదటి ఎపిసోడ్ ను ఫ్రీగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఆహాకు రావాల్సిన ఆదాయం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఫ్రీగా టెలిగ్రామ్ లో వస్తుండడంతో అందరూ డౌన్ లోడ్ చేసుకొని మరి చూసేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై కూడా ఇప్పుడు ప్రభావం పడే అవకాశం ఉంది. ఉచితంగా టెలిగ్రామ్ లో చూసేదానికి సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం ఎందుకు అనే ఆలోచన కూడా చాలామందికి రావచ్చు.

Post a Comment

Previous Post Next Post