కళ్యాణ్ రామ్ 'అమిగోస్' - మూవీ రివ్యూ & రేటింగ్


కథ:
మనిషిని పోలిన మనుషులు సంబంధించిన అంశాలపై మంజునాథ్(కళ్యాణ్ రామ్) ఆసక్తిని పెంచుకుంటాడు. అయితే అతను ఒక వెబ్సైట్ ద్వారా తన పోలికలతో ఉన్న ఇతర వ్యక్తుల గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. దీంతో అతనికి అదే పోలికలతో ఉన్న మైఖేల్(కళ్యాణ్ రామ్) పరిచయం అవుతాడు. ఇక మైఖేల్ చేసిన ఒక పొరపాటు కారణంగా మంజునాథ్ జాతీయ భద్రత అధికారులకు అరెస్టు చేస్తారు. ఇక మరోవైపు మంజునాథ తప్పించుకోవడానికి తన రూపంలో ఉన్న మరో వ్యక్తి సిద్దు( కళ్యాణ్ రామ్) ఇంట్లోకి వస్తాడు. సిద్దు అప్పటికే ఇషిక అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లికి కూడా సిద్ధమవుతూ ఉంటాడు. అసలు ఈ మైఖేల్ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా ఏం చేస్తాడు? అతని బదులు మధ్యన మిగతా ఇద్దరు ఎలా ఇరుక్కుంటారు? ఇక సిద్దు తన ప్రేయసిని ఎలా కాపడతాడు? ఇక ఒక మనిషిని పోలిన మనుషులను కలుసుకోవడం వలన ముగ్గురు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అనేది ఈ సినిమాలోని అసలు కథాంశం.

విశ్లేషణ:
కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా డిఫరెంట్ పాయింట్ కథలను ఎంచుకునేందుకు ఆసక్తిని చూపిస్తాడు. ఇక ఇప్పుడు అమీగోస్ అనేది కూడా చాలా కొత్త కథగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు ఒకే పోలికలతో ఉండడం. ఇక ఒకరి వలన మరొకరికి ఇబ్బంది పడడం. ఇక ఏకంగా మాఫియా బ్యాక్ డ్రాప్ అలాగే దేశ భద్రతకు సంబంధించిన అంశాలను కూడా ఇందులో జత చేశారు. దానికి తోడు ఒక ప్రేమ కథను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. దర్శకుడు రాజేందర్ రాసుకున్న కదా చాలా కొత్తది కానీ దాన్ని కొనసాగించిన స్క్రీన్ ప్లే మాత్రం చాలా రొటీన్ గానే అనిపిస్తూ ఉంటుంది.

ప్రేక్షకులకు ట్విస్ట్ లు పసి గట్టడానికి పెద్దగా సమయం పట్టదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా తరహాలో ఉండే ప్రేమ కథ సినిమాకు ఒక మైనస్ అనే చెప్పాలి. అందులో కాస్త కొత్తగా ప్రయత్నాలు చేసి ఉంటే బాగుండేది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం దర్శకుడు కాస్త గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. మైఖేల్ పాత్రలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడు. మిగతా రెండు క్యారెక్టర్స్ సాధారణంగానే ఉన్నా మైఖేల్ క్యారెక్టర్ లో మాత్రం అతను చూపించిన షేడ్స్ సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళ్లాయి. 

ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ గ్లామర్ కి తప్పితే మిగతా సన్నివేశాల్లో పెద్దగా హైలైట్ అయింది లేదు. ఇక బ్రహ్మాజీ సప్తగిరి మధ్య మధ్యలో పరవాలేదు అనిపించారు. ఇక ఈ సినిమాలో సౌందర్య రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అతను అద్భుతంగా తన పనితనం చూపించాడు. ఈ సినిమాలో మ్యూజిక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

ఎన్నో రాత్రులు వస్తాయి అనే పాట మినహాయిస్తే మిగతా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ చిత్రం మనిషిని పోలిన మనుషుల కాన్సెప్ట్ తో ఒక సరికొత్త యాక్షన్ డ్రంగా వచ్చింది. అయితే రొటీన్ లవ్ స్టోరీ అలాగే స్క్రీన్ ప్లే కూడా కాస్త రోటిన్ గా ఉండడం సెకండ్ హాఫ్ లో కూడా కాస్త రెగ్యులర్ పాయింట్స్ ఉండడంతో సినిమా అంత కొత్తగా థ్రిల్ ఏమీ ఇవ్వకపోవచ్చు. కేవలం కళ్యాణ్ రామ్ మైకేల్ పాత్ర మాత్రం కాస్త కొత్తగా ఉంటుంది. ఇక పెద్దగా అంచనాలు లేకుండా వెళితే ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

ప్లస్ పాయింట్స్:
👉కళ్యాణ్ రామ్ మైకేల్ క్యారెక్టర్
👉కథ, కొన్ని యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:
👉ఫస్ట్ లో రొటీన్ లవ్ సీన్స్
👉స్క్రీన్ ప్లే
👉మ్యూజిక్

రేటింగ్: 2.75/5

Post a Comment

Previous Post Next Post