వెంకీ జీతం పెరిగింది.. సైంధవ్ కు ఎంతంటే?


హిట్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ తన 75వ సినిమా సైంధవ్ ను ఇటీవల స్టార్ట్ చేశాడు. అయితే అంతకుముందు వరకు రెమ్యునరేషన్ విషయంలో సక్సెస్ అయితే గాని నెంబర్ పెరిగింది లేదు. సినిమా బిజినెస్ ను బట్టి కాకుండా వెంకటేష్ ఒక ఎమౌంట్ తీసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈసారి సైంధవ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి తన రెమ్యునరేషన్ ఎక్కువగానే పెంచినట్లు సమాచారం.

గత ఏడాది ముందు వరకు కూడా వెంకీమామ ఒక్క సినిమాకు 12 నుంచి 13 కోట్ల మధ్యలో తీసుకుంటు వచ్చాడు. కానీ ఇప్పుడు సైంధవ్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 15 నుంచి 17 కోట్ల మధ్యలో అందుకుంటున్నట్లు సమాచారం. వెంకటేష్ కెరీర్ లోనే ప్రస్తుతం ఇది అత్యధిక రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ అయితే ఆ నెంబర్ ఈజీగా 20 కోట్లను దాటుతుంది అని చెప్పవచ్చు. మరి సైంధవ్ రిజల్ట్ ఏ విదంగా ఉంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post