బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తెలుగులో కమర్షియల్ సినిమాలు బాగానే చేశాడు. అందులో చాలావరకు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే బెల్లంకొండ ఎలాగోలా ఇక్కడే ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే మరికొంత ప్లస్ అయ్యేది. కానీ అనవసరంగా ఛత్రపతి రీమేక్ అంటూ హిందీలో హడావుడి చేయాలని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ సినిమా షూట్ పూర్తయినా థియేట్రికల్ బిజినెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. సినిమా స్టఫ్ పై అంతగా ఆసక్తి లేదని ఇంతవరకు సింగిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇక చేసేదేమీ లేక పెన్ స్టూడియోస్ ఇప్పుడు ఓటీటీకి అమ్మేస్తున్నట్లు సమాచారం. ఇక హీరోగారు మళ్ళీ టాలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పించేందుకు భీమ్లా నాయక్ దర్శకుడితో చేతులు కలుపుతున్నాడు. ఈ న్యూ ప్రాజెక్ట్ మార్చిలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ లో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
Follow
Post a Comment