కార్డియక్ అరెస్ట్ కారణంగా 23 రోజులపాటు హాస్పిటల్ లోనే చికిత్స తీసుకున్న తారకరత్న ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తప్పకుండా అతను కోలుకుంటాడు అని భార్యాపిల్లలు చాలా రోజులపాటు బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్ లోనే ఉండిపోయారు. తారకరత్న అలేఖ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
తారకరత్నకు ముగ్గురు పిల్లలు మొదట అమ్మాయి పేరు నిషిక ఆ తర్వాత కవలలు అబ్బాయి, అమ్మాయి జన్మించగా వారికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. (Nishka, Tanayram, Reya) NTR అని వచ్చే విధంగా వారికి పేర్లు పెట్టడం విశేషం. అయితే తారకరత్న మరణం తరువాత పిల్లల భవిష్యత్తును పూర్తిగా బాలకృష్ణ తీసుకున్నట్లు సమాచారం. తారకరత్న హాస్పిటల్ కు సంబంధించిన విషయాలను మొత్తం బలయ్యే దగ్గరుండి చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన వారికి వెన్నంటే ఉండు సాయం చేయడానికి సిద్ధమయ్యారు.
Follow
Post a Comment