పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కనున్న వినోదాయ సిత్తం రీమేక్ ఈ రోజు అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ టార్గెట్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే అతను కేవలం 25 రోజులు డేట్స్ మాత్రమే అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇక దానికోసమే దాదాపుగా 60 కోట్ల వరకు పారితోషికం కూడా అందుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ డేట్స్ ను బట్టి ఈ సినిమా షూటింగ్ కొనసాగే అవకాశం ఉంది. వీలైనంతవరకు పవన్ కళ్యాణ్ మూడు షెడ్యూల్స్ లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే ఛాన్స్ ఉందట. ఇక ఫైనల్ గా షూటింగ్ ను నాలుగు నెలల్లో పూర్తి చేసి ఇదే ఏడాది ఆగస్టు నెలలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంటే హరిహర వీరమల్లు సినిమా కంటే ముందుగానే ఈ సినిమా ఉండబోతోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment