ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 1000 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. ముఖ్యంగా బన్నీ నిర్మాతలతో కూడా అదే విషయంలో చాలాసార్లు చర్చలు జరిపినట్లు టాక్ కిడా వచ్చింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
పుష్ప 2కి అసలు బజ్ ఇంకా స్టార్ట్ కాలేదు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ వస్తుందని అంటున్నారు. ఒకవేళ అది హై రేంజ్ లో క్లిక్ అయితే పెరిగే అవకాశం ఉంది. టోటల్ గా అయితే పుష్ప 2 700 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే ఛాన్స్ ఉందట. కానీ బన్నీ టార్గెట్ మాత్రం 1000 కోట్లకు తక్కువ కాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాకు బజ్ కూడా పెంచే విధంగా సుకుమార్ తో సైతం చర్చలు జరుపుతున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Follow
Post a Comment