స్టార్ హీరో ఆఫర్.. అసలు పూరి ఏమైనట్లు?


లైగర్ డిజాస్టర్ దెబ్బకు పూరి చాలా వరకు సైలెంట్ అయ్యాడు. పూరీ ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అతను ఏమి చేస్తున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. మూడు నెలల్లో సినిమాని రూపొందించగల సామర్థ్యంతో పేరుగాంచిన పూరి లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక "ఇస్మార్ట్ శంకర్"తో బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత, అతను "లైగర్"తో తడబడ్డాడు.

లైగర్ వలన ఆర్థిక సమస్యలు కేసులు కొంత ఇబ్బందిని కలిగించాయి. ఇక మొదట్లో పూరి జగన్నాధ్ మెగాస్టార్‌ కి స్క్రిప్ట్‌ని అందించాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మెగాస్టార్ "భోళాశంకర్" తర్వాత పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నాడు. ఇక పూరిని కూడా ఒక కథ రెడీ చేసుకొమ్మని చెప్పారట. కానీ ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు పూరి జగన్నాధ్‌కి మెగాస్టార్ మాత్రమే సరైన ఛాయిస్ అని తెలుస్తోంది. అయితే మెగాస్టార్ ఇతర దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. మరి ఈ పోటీలో పూరి మెగాస్టార్ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post