మహేష్ బాడీ బిల్డింగ్.. అసలు కారణం ఏమిటంటే?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఊహించని ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఇంత సడన్ గా మహేష్ ఎందుకు ఈ తరహా బాడీని పెంచుతున్నాడు అనే సందేహం ప్రతి ఒక్కరిలో కూడా మొదలైంది. సాధారణంగా మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసిన కూడా తన ఫిట్నెస్ విషయంలో అయితే పెద్దగా మార్పులు చేయడు. కానీ ఈసారి మాత్రం కాస్త గట్టిగానే కండలు పెంచుతున్నాడు.

త్రివిక్రమ్ సినిమాలో కాస్త యాక్షన్ ఉన్నప్పటికీ కూడా అందులో పెద్దగా బాడీ చూపించే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ మహేష్ మాత్రం రాజమౌళి సినిమాలో తప్పకుండా ఏదో ఒక డిఫరెంట్ బాడీని మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే రాజమౌళి హఠాత్తుగా బాడీని పెంచేమంటే కూడా అంత సులువు కాదు. ఆరోగ్యానికి కూడా అది అంత మంచిది కాదు. అందుకే మహేష్ ముందస్తుగానే తన బాడీని రాజమౌళి ప్రాజెక్టు కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా కొంత కండలు పెంచే విధంగా బాడీని ప్రిపేర్ చేస్తున్న మహేష్ రాజమౌళి సినిమాకు వచ్చేసి సమయానికి పూర్తిస్థాయిలో బాడీని మరింత పెంచే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post