సినిమా హిట్ అయితే ప్రేక్షకులే దేవుళ్ళు. అదే సినిమా ఒక వేళ ఫ్లాప్ అయితే వాళ్ళకు సినిమా చూడడం రాదు అంటారు. కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డారు అంటారు. సగటు ప్రేక్షకులను తిట్టే గుణం ప్రతీ దర్శకుడికి ఉంటుంది.. ఫ్లాప్ రానంత వరకు. ఇక రీసెంట్ గా ఒక మహా దర్శకుడు అయితే KGF సినిమాను చూసినోళ్లను హేళన చేసిన విధానం సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయ్యింది.
KGF సంగతి పక్కన పెడితే ఏ సినిమా అయినా సరే చూసే ప్రేక్షకుడు ఇష్టం. 200 రూపాయల కన్నా అతను పెట్టె 3 గంటల సమయం చాలా వాల్యూ కలిగింది. అలాంటి ఆడియోన్.. నీ సినిమా చూసి ఎదో సాధించాలని వెళ్ళడు. తన ప్రపంచాన్ని మర్చిపోయి ఒక కొత్త అనుభవం పొందాలని అనుకుంటాడు. కాస్త విశ్వనాథ్ కమ్ముల గారి లాంటి సినిమాలు ఉంటే మంచి ఫీల్ తో సినిమా చూడండి అంటూ మిగతా వాళ్లకు చెబుతారు.
మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఎప్పుడు వదలరు. వాళ్ళను ఎంటర్టైన్ చేసే సత్తా ఉంటే భాషను కూడా పట్టించుకోరు. సుకుమార్ కూడా ఒకప్పుడు తను చేసిన మిస్టేక్స్ పట్టించుకోకుండా జనాలను బాగానే తిట్టాడు. మనకు నచ్చింది నలుగురికి నచ్చదు.. మిగతా వాళ్ళకు కూడా గొప్పగా నచ్చాలని ఏమి లేదు. ఆ విషయం తెలిసాకే సుక్కు చాలా చేంజ్ అయ్యాడు. అంతే గాని నేను తీసింది కళాఖండం అది హిట్ అవ్వలేదు అంటే అంత కంటే యెడ్డీతనం మరోటి ఉండదు.
మహా దర్శకుడు మాత్రమే కాకుండా మొన్న *అంటే.. దర్శకుడు కూడా తను చేసిన మిస్టేక్ ఏమి లేదని గొప్ప సినిమా తీశానని చూసే విధానం తెలియనప్పుడు ఏమి చేయలేమన్నట్లు మాట్లాడాడు. నేటితరం యువ దర్శకులు ఈ తరహా పోకడలో వెళితే మరో మెట్టు ఎదగడం కష్టం. టోటల్ గా అన్ని దారుల నుంచి ఆలోచిస్తే సినిమా అనేది వ్యాపారం. ప్రశాంత్ నీల్ తన సినిమాతో 200 రూపాయలు పెట్టిన ఆడియెన్ ను సంతృప్తి పరిచాడు. ప్రేక్షకుడు సినిమా ఎంటర్టైన్ అయితేనే చప్పట్లు కొడతారు. అలాగే బంగారం మొత్తం పడేశాడు అన్నాడు. ఇంకో పార్ట్ 3 లో హీరో మరో మరొకటి చేయవచ్చు అని కామన్ సెన్స్ ఉన్న ఏ ప్రేక్షకుడు అయినా గెస్ చేయగలడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మహా దర్శకుడు కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.
Follow
1 Comments
Director name mention cheyyaledhante meeru yentha bayathulo Arthas avuthundhi. Yevarikiaina comment chese minimum rights untaayee
ReplyDelete