రామబాణంకు మరో సమస్య?


మ్యాచోస్టార్ గోపీచంద్, లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ ఈసారి రామబాణంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  ఈ సినిమా ఇద్దరికి చాలా అవసరం. ఇక రామ బాణం చిత్రం మే 5, 2023న విడుదల కానుంది. శ్రీవాస్ అవుట్‌పుట్‌తో రాజీపడే మూడ్‌లో లేడని టాక్. ఇక సినిమా కోసం అతను రీషూట్స్ ఎక్కువగా చేసినట్లు సమాచారం. ఇక రామబాణం రన్ టైమ్ చాలా ఎక్కువగా మారింది.  అతను దాదాపు 3.5 గంటల పాటు సినిమాను తీశాడట. 

ఇక రామబాణం మేకర్స్ ఎడిటింగ్ టీమ్ సహాయంతో దాదాపు గంట పాటు సినిమాను ట్రిమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక పని దినాల సంఖ్య, షూటింగ్‌లో జాప్యం కారణంగా సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. గోపీచంద్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బాడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమని తెలుస్తోంది. అయితే గోపిచంద్ ట్రాక్ రికార్డు చూస్తే గత సినిమాలు చాలా వరకు డిజాస్టర్ అయ్యాయి. లౌక్యం తరువాత సరైన సక్సెస్ లేదు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post