అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ సీక్వెల్ పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరొక ముఖ్యమైన పాత్ర కోసం కొత్త హీరోయిన్ ను దర్శకుడు సంప్రదించినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.
సాయి పల్లవి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఫైనల్ అయినట్లుగా కూడా చెబుతున్నారు. అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. దాదాపు సినిమా షూటింగ్ ముందే దర్శకుడు పుష్ప 2కు సంబంధించిన పూర్తి క్యాస్ట్ ను ఫైనల్ చేసుకున్నాడు. ఇక ఇందులో సాయి పల్లవి నటించిన నటించే అవకాశం లేదు అని తెలుస్తోంది. ఒక విధంగా అయితే ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలి అనే ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత ఎదురుచూస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.
Follow
Post a Comment