RC 15 టైటిల్.. ఇందులో ఏది ఫిక్స్?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కలయికలో తెరపైకి రాబోతున్న RC 15 ప్రాజెక్ట్ టైటిల్ ఏమిటి అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి.

మొదట ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ అనుకున్నట్లు టాక్ వచ్చింది. అలాగే మధ్యలో అధికారి, సీఎం(కామన్ మ్యాన్) అనే పేర్లు కూడా చర్చల్లోకి వచ్చాయి. ఇక రీసెంట్ గా సిటిజన్ అనే పేరు కూడా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా సినిమాకు సీఈవో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. కథకు కరెక్ట్ గా సెట్ అయ్యే విధంగా ఈ టైటిల్ పెడితే బాగుంటుంది అని శంకర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post