వెంకటేష్, రానా దగ్గుపాటి కలిసి నటించిన మొదటి వెబ్ సిరీస్ రామానాయుడు అడల్ట్ కంటెంట్ అని ముందుగానే ఒక హెచ్చరిక జారీ చేసేసారు. ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు ఫ్యామిలీతో కలిసి ఈ వెబ్ సిరీస్ అసలు చూడకండి అని కూడా రానా వివరణ ఇచ్చాడు ఓకే. ఇది నెట్ ఫ్లిక్స్ సిరీస్ కాబట్టి మినిమం అడల్ట్ కంటెంట్ ఉంటుంది అని ముందుగానే ఆడియన్స్ కూడా ఊహించారు.
ఒక విధంగా వెంకటేష్ అలా బూతులు మాట్లాడడం తప్పేమీ కాకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఒక నటుడిగా అతను తనలోని సరికొత్త బోల్డ్ షెడ్ను బయటకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం తప్పు కాకపోయి ఉండవచ్చు. కానీ వాళ్లు ఎలాగా ఆ ఆ వెబ్ సిరీస్ చేయాలనుకున్నారో తెలియదు గాని కరెక్టు కంటెంట్తో జనాలను ఇంకా మెప్పించి ఉంటే బాగుండేది.
ఇప్పుడు అందరి బాధ కూడా అసలు అందులో ఉన్న బూతు మాటలు కంటే కూడా స్క్రీన్ ప్లే డ్రామా అంత కొత్తగా ఏమీ లేదు అనే వాదననే ఎక్కువగా వినిపిస్తోంది. బూతులు ఉన్నంత మాత్రాన డిఫరెంట్ వెబ్ సిరీస్ లను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఏమీ లేవు. బూతు మాటలతో శృంగారభరితమైన సన్నివేశాలు ఉన్న చాలా వెబ్ సిరీస్ లు సక్సెస్ అయ్యాయి. కానీ వాటిలో సరైన స్టోరీ కంటెంట్ డ్రామా ఉంటేనే అవి క్లిక్ అయ్యాయి.
కానీ రానా నాయుడు సినిమాలో మాత్రం కేవలం ఇలాంటి బూతులు తిట్టడం కోసమే చూసినట్లుగా ఉంది అని కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంతగా కొత్త కంటెంట్ ఏమి లేదు. ఈ విషయంలో రానా వెంకటేష్ కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. వెబ్ సిరీస్ సక్సెస్ కాకపోగా ఒక్కసారిగా నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువైపోయాయి. ఇక మొదటి సీజన్ తోనే రానా నాయుడుకు స్వస్తి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow
Follow
Post a Comment