ప్రభాస్ కోసం మూడు బడా సంస్థలు!


ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పాన్-ఇండియన్ యాక్షన్ మూవీ చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. షూట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని కూడా అన్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ లకు చాలా కాలం క్రితమే అడ్వాన్స్‌లు చెల్లించింది.  సిద్ధార్థ్ చెప్పిన కథకు ప్రభాస్ ఇటీవల అధికారికంగా ఆమోదం తెలిపాడట. ఇక  మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ హోమ్ బ్యానర్ UV క్రియేషన్స్ మూడవ నిర్మాణ సంస్థగా చేరే ఛాన్స్ ఉంది.

UV క్రియేషన్స్ ఈ చిత్రంపై పెద్దగా పెట్టుబడి పెట్టలేదు కానీ ప్రాజెక్ట్ తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.  భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం మల్టీస్టారర్‌గా రూపొందనుందని సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ చివరి చిత్రం పఠాన్ సంచలన విజయం సాధించింది. ఇక అతను ప్రస్తుతం హృతిక్ రోషన్ తో ఫైటర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది.  మరోవైపు ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్, మారుతి సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Post a Comment

Previous Post Next Post