ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. నిజమెంత?


టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ తమిళ కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో కలిసి సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  గత ఏడాది హైదరాబాద్‌లో వీరిద్దరూ సుదీర్ఘంగా సమావేశమైన తర్వాత ఈ న్యూస్ వైరల్ అయ్యింది. ఇక ధనుష్ కూడా మరో హీరో అని ఫైనల్ నేరేషన్ కోసం ఎన్టీఆర్ ఎదురుచూస్తున్నాడని కూడా టాక్ వచ్చింది.  

ఇక ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ టీమ్ నుంచి వచ్చిన క్లారిటీని బట్టి ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.  జూనియర్ ఎన్టీఆర్- ధనుష్- వెట్రిమారన్ సినిమాపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ.. అవి పూర్తిగా అబద్ధమని కూడా ఎన్టీఆర్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.  ఇక ఇటీవల ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వేడుక అనంతరం ఏప్రిల్ నెలలో కొరటాల శివ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Post a Comment

Previous Post Next Post