రామ్ చరణ్ లైనప్.. మరో ఇద్దరు దర్శకులు కావాలి!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సినిమాలు చేయబోయే సంస్థలు ప్రత్యేకంగా  విషెస్ అందించాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో శంకర్ దర్శకత్వం వహిస్తున్న 15వ సినిమా గేమ్ చెంజర్ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా రానుంది. 

ఈ సినిమాను వ్రిద్ధి సినిమాస్ అనే కొత్త బ్యానర్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక UV క్రియేషన్స్ లో కూడా చరణ్ ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు దర్శకుడు ఇంకా ఫిక్స్ కాలేదు. ఆ మధ్య కన్నడ దర్శకుడు నర్థన్ అన్నారు గాని అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. ఇక RRR నిర్మాత DVV ఎంటర్టైన్మెంట్స్ దానయ్య కూడా చరణ్ కు అడ్వాన్స్ ఇచ్చాడు. ఇక ఈ బ్యానర్ లో కూడా సినిమా చేయాల్సి ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అనే టాక్ వచ్చినా ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి ఈ లైనప్ తో రామ్ చరణ్ తన మార్కెట్ స్థాయిని ఇంకా ఏ లెవెల్ కు పెంచుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post