ఏజెంట్ రేంజ్ తగ్గిస్తున్నట్లే ఉంది!


అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న Agent నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ హైప్ ని తగ్గిస్తున్నట్లు ఉంది గాని పెంచుతున్నట్టు లేదు. అసలే సినిమా పాన్ ఇండియా రిలీజ్ అని స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ కు సంబంధం లేకుండా అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫిట్నెస్ లుక్స్ మాత్రమే ఆసక్తిని కలిగించాయి. 

కానీ ఆ తరువాత అఫీషియల్ గా సినిమా నుంచి వచ్చిన పోస్టర్ల నుంచి సాంగ్స్ అప్డేట్స్ వరకు ఏవి కూడా హైప్ పెంచడం లేదు. ఒకవైపు ఆలస్యం మరోవైపు సరైన ప్రమోషన్స్ లేవు, వస్తున్న పాటలకు స్పందన లేదు.  అంతే కాకుండా సినిమా బడ్జెట్ మొదట అనుకున్న దాని కంటే చాలా ఎక్కువగానే పెరిగింది. 40 కోట్లతో పూర్తి చేయాలి అనుకున్నారు కానీ ఆ తరువాత ఆ నెంబర్ 70 వరకు వచ్చినట్లు టాక్ వస్తోంది. మరి సినిమాకు అసలైన బజ్ ఎప్పుడు పెంచుతారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post