ఆ వెర్షన్ సలార్ లో సాంగ్స్ ఉండవట!


ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తప్పకుండా సినిమా KGF ను మించి ఉంటుందని టాక్ వస్తోంది. 


ఇక సలార్ సినిమాను ఇంగ్లీషులో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇంగ్లీష్ వెర్షన్ లో చాలా తేడాలు కనిపించబోతున్నాయి. సాంగ్స్ అసలు ఉండవట. అలాగే కొన్ని సీన్స్ కూడా ఎడిట్ లో తీసేసే అవకాశం ఉందట. తెలుగు వెర్షన్ కు ఇంగ్లీష్ వెర్షన్ కు దాదాపు అరగంట తేడా ఉండబోతోందని సమాచారం. ఇక సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post