దసరాకు బిగ్ షాక్.. ఏకంగా 36 కట్స్!


నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన 'దసరా' సినిమా మార్చి 30వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు అన్ని ముగిశాయి. సుకుమార్ దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన శ్రీకాంత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక U/A సర్టిఫికెట్ అందుకున్న దసరా సినిమాకు సెన్సార్ యూనిట్ పెద్ద షాక్ ఇచ్చింది. దాదాపు 36 సీన్స్ అభ్యంతరంగా ఉండడంతో కట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇప్పటివరకు ఏ సినిమాకు ఈ రేంజ్ లో సెన్సార్ కట్ జరగలేదు. కంప్లీట్ RAW సినిమాగా తెరపైకి తీసుకు రావాలని కొత్త దర్శకుడు బాష విషయంలో సీన్స్ విషయంలో అత్యుత్సాహం చూపడంతో సెన్సార్ బోర్డ్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. సినిమాలో అసలైన డైలాగ్స్ చాలా వరకు మ్యుట్ అయినట్లు తెలుస్తోంది. ఆ డైలాగ్స్ తోనే మొన్నటివరకు నాని ప్రమోషన్స్ బాగా చేశాడు. ఇక ఇప్పుడు సెన్సార్ తీసుకున్న నిర్ణయం వలన సినిమా షేడ్ మారే అవకాశం లేకపోలేదు. మరి చిత్ర యూనిట్ మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post