స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకవైపు గేమ్ చేంజర్ సినిమాతో పాటు మరోవైపు ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులను కూడా చకచగా పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముందుగా అయితే ఇండియన్ 2 సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. గేమ్ చెంజర్ ను కూడా నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుంది అని ముందు అనుకున్నాడు.
కానీ ఇప్పుడు వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే సంక్రాంతి ఇప్పటికే పెద్ద సినిమాలతో ఫుల్ ప్యాక్ అయిపోయింది. కాబట్టి గేమ్ చెంజర్ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ గేమ్ చెంజర్ ఆ సమయంలో వస్తే శంకర్ ప్లాన్ ప్రకారం ఇండియన్ 2 సినిమాను సమ్మర్ కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్లీ షూటింగ్ టైమింగ్స్ మొత్తం చేంజ్ అవుతాయి. కాబట్టి రిలీజ్ డేట్ విషయంలో కూడా చాలా గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్లాన్ తో అయినా శంకర్ అనుకున్న సమయానికి ఆ రెండు సినిమాలను రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి.
Follow
Post a Comment