పుష్ప 2 డిజిటల్ రైట్స్.. టార్గెట్ పెద్దదే!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మార్కెట్లో మంచి డిమాండ్ ను ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ 1000 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయాలి అని అల్లు అర్జున్ అలాగే సుకుమార్ ఇద్దరు ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. ఇక నాన్ థియేట్రికల్ గా కూడా బిజినెస్ హై రేంజ్ లోనే ఉండాలి అని చూసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు డిజిటల్ రైట్స్ కోసం పోటీ ఎక్కువవుతున్న సమయంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎక్కువగా ఆఫర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పుష్ప 2 టీం మాత్రం దాదాపు 200 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే నెట్ ఫ్లిక్స్ ఇంకా ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ డిజిటల్ రైట్స్ మొత్తాన్ని కూడా ఈ సంస్థ దక్కించుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ కూడా చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి పుష్ప 2 డిజిటల్ రేట్స్ ఏ రేంజ్ లో అమ్ముడుపోతాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post