బాలీవుడ్ స్టార్ మేకర్ ఆదిత్య ధర్ గత ఐదేళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. మహాభారతం నుండి ప్రేరణతో అశ్వత్థామను పాత్రను ఆధునిక-కాలపు సూపర్‌హీరోగా చూపిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో కథను డిజైన్ చేస్తున్నారట. ఇక రెండు భాగాలుగా ఉండే ఆ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడానికి అల్లు అర్జున్ తో జియో స్టూడియోస్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
జియో స్టూడియోస్, అల్లు అర్జున్ కలయిక వలన ప్రాజెక్ట్ పరిమాణాన్ని పెంచుతుంది. మరిన్ని వివరాలు బయటకు రావడానికి సమయం పట్టవచ్చు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్ వంటి చిత్రాలతో తన కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నాడు. అలాగే అతని లైన్ లో త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నారు. మరోవైపు అట్లీ, SS రాజమౌళితో కలిసి పని చేయడం గురించి ఊహాగానాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక ఇమ్మోర్టల్ అశ్వత్థామ మాత్రం బన్నీ తప్పకుండా చేసే ఛాన్స్ ఉందట. మరి ఈ కథనాలపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
Follow
Post a Comment